చంద్రబాబుతో ఏపీ సీఎస్‌ విజయానంద్‌ భేటీ

2024-12-31 13:49:06.0

ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్‌

https://www.teluguglobal.com/h-upload/2024/12/31/1390554-babu-cs-vijayanand.webp

ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీగా కె. విజయానంద్‌ మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసంలో సీఎంను సీఎస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు సీఎస్‌గా అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఏపీ సెక్రటేరియట్‌లో విజయానంద్‌ సీఎస్‌ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. ఏపీ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం రిటైర్‌ అయ్యారు. 1992 బ్యాచ్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ ప్రస్తానాన్ని ప్రారంభించిన ఆయన వివిధ హోదాల్లో సేవలందించారు. సీఎస్‌ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్‌ ను స్పెషల్‌ సీఎస్‌ లు సాయిప్రసాద్‌, కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, జేఏడీ సెక్రటరీ సురేశ్‌ కుమార్‌, ఉన్నతాధికారులు కాంతిలాల్ దండే, జయలక్ష్మి, కుమార్ విశ్వజిత్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.