2022-06-04 06:02:25.0
అమరావతి విషయంలో జగన్‌మోహన్ రెడ్డి వైఖరి మార్చుకుని, రాజధాని నిర్మాణం కొనసాగించాలన్న ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం సూచనలపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రంగా స్పందించారు. గతంలో చంద్రబాబు ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించిన హరగోపాల్ ఇప్పుడు పిలవగానే పేరంటానికి వచ్చినట్టుగా వచ్చి అమరావతివాదులకు మద్దతు ఇస్తున్నారని సురేష్ విమర్శించారు. అసలు ఎందుకు వెళ్తున్నాం అన్న ఆలోచన కూడా లేకుండా వీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరావతి 900 రోజుల కార్యక్రమంలో వీళ్లంతా భాగస్వామ్యులుగా మారి […]
అమరావతి విషయంలో జగన్‌మోహన్ రెడ్డి వైఖరి మార్చుకుని, రాజధాని నిర్మాణం కొనసాగించాలన్న ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం సూచనలపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రంగా స్పందించారు. గతంలో చంద్రబాబు ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించిన హరగోపాల్ ఇప్పుడు పిలవగానే పేరంటానికి వచ్చినట్టుగా వచ్చి అమరావతివాదులకు మద్దతు ఇస్తున్నారని సురేష్ విమర్శించారు. అసలు ఎందుకు వెళ్తున్నాం అన్న ఆలోచన కూడా లేకుండా వీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరావతి 900 రోజుల కార్యక్రమంలో వీళ్లంతా భాగస్వామ్యులుగా మారి చంద్రబాబు బినామీ రాజధానికి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు.
హరగోపాల్, కోదండరాం తదితరులు ముందుగా ఢిల్లీ వెళ్లి మేధా పాట్కర్‌ను కలవాలని.. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన విధ్వంసం ఆమె వివరిస్తారని సూచించారు. అమరావతిలో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని… చంద్రబాబుకు ఆయన బినామీలకు, దోచుకోవాలనుకున్న బిల్డర్లకు మాత్రమే నష్టం కలిగిందన్నారు. పైగా ఇక్కడి తరహా పాలన మరెక్కడా ఉండదని మాట్లాడారని.. నిజంగానే ఏపీలో తరహా పాలన మరెక్కడ లేదని… ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్న ప్రభుత్వం మరొక చోట లేదన్నారు వైసీపీ ఎంపీ. జగన్‌కు సూచనలు చేస్తున్న వారు… గతంలో సీఎంగా చంద్రబాబుకు ఎలాంటి అధికారాలు ఉన్నాయో.. జగన్‌కు కూడా సీఎంగా అవే అధికారాలుంటాయన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.
నిజానిజాలు తెలుసుకోకుండా.. అమరావతివాదులు పిలవగానే హరగోపాల్, కోదండరాం లాంటి వారు పేరంటానికి వెళ్లి వాయనం తీసుకుని వెళ్లడమే కదా అన్నట్టుగా వచ్చేశారన్నారు. కమ్యూనిస్టులు గతంలో పేదల పక్షాల నిలబడుతారన్న అభిప్రాయం ఉండేదని.. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఎక్కడ నష్టపోతే అక్కడ వీరు దిగిపోతున్నారని విమర్శించారు.
గెలిచే పరిస్థితి లేకపోవడంతో అందరి తలకాయలు అతికించుకుని తిరిగేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే… మీరంతా వచ్చారా అని హరగోపాల్, కోదండరాంలను నందిగం సురేష్ ప్రశ్నించారు. అమరావతి రైతులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలి గానీ.. ఇక్కడే రాజధాని ఉండాలని చంద్రబాబు తరహాలో మాట్లాడవద్దని హరగోపాల్, కోదండరాంను ఉద్దేశించి నందిగం సురేష్ వ్యాఖ్యలు చేశారు.
Amravati,jaganmohan reddy,Professor Hargopal’s and Kodandaram’s,YCP MP Nandigam Suresh