2024-09-30 13:48:13.0
సుప్రీం కోర్టు తీర్పు వార్త క్లిప్పింగ్ తో జస్ట్ ఆస్కింగ్ అన్న ప్రకాశ్ రాజ్
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం మరో ట్వీట్ చేశారు. దేవుణ్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ప్లీడింగ్ అనే హ్యాష్ ట్యాగ్ లను తన ట్వీట్ లో జత చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యిందంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పాపం చేసిందని.. దానికి పరిహారంగా ప్రయాశ్చిత దీక్ష చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎండగడుతూ ప్రకాశ్ రాజ్ గతంలో పలు ట్వీట్లు చేశారు. సోమవారం సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సుప్రీం కోర్టు చేసిన కామెంట్స్ తో కూడిన ఫొటోను జత చేసి తన ‘ఎక్స్’ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు.
tirumala,srivari laddu,chandrababu,pavan kalyan,prakash raj,supreme court comments