https://www.teluguglobal.com/h-upload/2025/03/02/500x300_1407930-blue-ghost-moon-lander-captures.webp
2025-03-02 06:43:09.0
చంద్రుని ఈశాన్య భాగాన ల్యాండ్ చేయనున్నట్లు వెల్లడి
బ్లూఘోస్ట్ ల్యూనార్ ల్యాండర్‌ను చంద్రునిపై ల్యాండ్ చేయడానికి సర్వసిద్ధమైనట్లు నాసా తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3.34 నిమిషాలకు బ్లూఘోస్ట్ ల్యాండర్‌ను జాబిల్లిపైకి దించడానికి యత్నిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యూనార్ ల్యాండర్‌గా బ్లూఘోస్ట్ నిలువనున్నది. చంద్రుని ఈశాన్యం వైపు ఉన్న మేర్ ఫ్రిగోరిస్‌లోని అగ్నిపర్వత ప్రదేశమైన మేర్ క్రిసియం సమీపంలో ల్యాండర్‌ను దించనున్నట్లు నాసా పోస్టులో వివరించింది. ఇందుకోసం అంతరిక్ష నౌకను దిగువ కక్ష్యలోకి మార్చేందుకు ప్రయోగం విజయవంతమైందని పేర్కొన్నది. బ్లూఘోస్ట్‌లో 10 పరికరాలను అమర్చారు. చంద్రుని ఉపరితల మట్టిని విశ్లేషించడానికి రేడియేషన్ తట్టుకోగల కంప్యూటర్, గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి. పూర్తి లూనార్ డే అంటే భూమిపై 14 రోజుల పాటు పనిచేసేలా ల్యాండర్‌ను సిద్ధం చేశారు.మార్చి 14న చంద్రునిపై ఏర్పడే గ్రహణాన్ని హెడీ క్వాలిటీతో ఫొటోలు తీయనున్నారు. మార్చి 16న జాబిల్లిపై సూర్యగ్రహణాన్ని బ్లూఘోస్ట్ చిత్రీకరించనున్నది.
Nasa’s private Blue Ghost,Attempt,Historic landing,Science and technology payloads,Analyze plume-surface
https://www.teluguglobal.com//science-tech/nasa-prepares-to-land-blueghost-lunar-lander-on-the-moon-1117249