https://www.teluguglobal.com/h-upload/2024/07/28/500x300_1347939-wrinkles.webp
2024-07-28 20:33:06.0
చర్మంపై ఉండే ఈ ముడతలను తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని సింపుల్ టిప్స్‌తో చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు.
ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు పొల్యూషన్ కారణంగా చాలామందికి చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతుంటుంది. అయితే చర్మంపై ఉండే ఈ ముడతలను తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని సింపుల్ టిప్స్‌తో చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. అదెలాగంటే..
సాధారణంగా చర్మానికి కొంత సాగే గుణం ఉంటుంది. చర్మంలో కొవ్వు శాతం తగ్గినప్పుడు, చర్మం పాడయ్యినప్పుడు ఆ సాగే గుణం పోయి చర్మం ముడతలు పడుతుంది. ఇలాంటప్పుడు స్కిన్ టైటెనింగ్ ఎక్సర్‌సైజలు, హెల్దీ డైట్ ద్వారా ముడతలు తగ్గించుకోవచ్చు.
చర్మం పాడవ్వడానికి హై షుగర్ కంటెంట్ కూడా ఒక కారణం. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోయి డ్రైగా తయారవుతుంది. కాబట్టి చర్మం ముడతలు పడతున్నవాళ్లు డైట్‌లో చక్కెర శాతాన్ని తగ్గించాలి.
చర్మం ఆరోగ్యంగా ఉండడానికి హెల్దీ ఫ్యాట్స్ చాలా అవసరం. చర్మం బిగుతుగా సాగే గుణంతో ఉండాలంటే డైట్‌లో తప్పకుండా నట్స్, కొబ్బరి, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలు కూడా తినాలి.
చర్మం ముడతలు పడుతున్నవాళ్లు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, మేకప్ ప్రొడక్ట్స్, సబ్బులు, క్రీముల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని కెమికల్స్ చర్మాన్ని మరింత పొడిబారేలా చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్తవహించాలి. వీలైనంతవరకూ నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి.
చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం, పొల్యూషన్‌లో ఎక్కువగా గడపడం, డిజిటల్ స్క్రీన్ వాడకం వంటి అలవాట్లు కూడా చర్మాన్ని పాడుచేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అలాగే చర్మ ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా అవసరం.
ఇకపోతే ముడతలు పడిన చర్మా్న్ని బిగుతుగా మార్చడం కోసం కలబంద, ముల్తానీ మట్టితో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అలాగే చర్మానికి నూనె అప్లై చేసి మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది. చర్మ ఆరోగ్యం కోసం కూరగాయలు, క్యారెట్, బీట్ రూట్, నట్స్, చేపలు ఎక్కువగా తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
Wrinkles,Skin,Health Tips
Wrinkles, Skin, wrinkles on skin, How to get rid of wrinkles, Telugu News, Telugu Global News, Health News, Health Tips Telugu
https://www.teluguglobal.com//health-life-style/how-to-get-rid-of-wrinkles-on-skin-1053143