2023-07-20 14:34:46.0
https://www.teluguglobal.com/h-upload/2023/07/20/797857-chalanam-leni-yantram.webp
నిన్నటి జీవితం లో
బరువును మోసిన
వెన్ను పూసలు
వంగిపోయాయి.
నిన్నటి జీవితంలో
బండలు బద్దలు
కొట్టిన కండలు
కరిగిపోయాయి
నిన్నటి జీవితంలో..
ఆలుబిడ్డల కడుపు నింప
కూలి పనుల కోసం
వలస బాట పట్టిచేసిన
జీ వన పయనం..
నేడు ఆగిపోయిందీ
నిస్తేజమయి.
కూలిపోయిన నీవు
ప్రాణం మాత్రమే ఉన్న
ఒక అస్థి పంజరం..
చలించని నిర్లక్ష్యపు
సమాజం
చలనం లేని
యంత్రం లా నీవు
– పి.బాల త్రిపుర సుందరి
( హైదరాబాద్ )
P Bala Tripura Sundari,Chalanam Leni Yantram,Telugu Kavithalu