https://www.teluguglobal.com/h-upload/2023/02/28/500x300_724869-chatgtp.webp
2023-02-28 10:23:08.0
చాట్ జీపీటీ వచ్చాక క్రియేటర్లకు భయం పట్టుకుంది. కంటెంట్ రైటింగ్ నుంచి ఫోటో ఎడిటింగ్ వరకూ అన్నిరకాల పనులు చేసేస్తున్న చాట్ జీపీటీ వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందని చాలామంది వాపోతున్నారు.
చాట్ జీపీటీ వచ్చాక క్రియేటర్లకు భయం పట్టుకుంది. కంటెంట్ రైటింగ్ నుంచి ఫోటో ఎడిటింగ్ వరకూ అన్నిరకాల పనులు చేసేస్తున్న చాట్ జీపీటీ వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందని చాలామంది వాపోతున్నారు. అయితే దీనికి సంబంధించి పలువురు టెక్ నిపుణులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఏ టూల్ అయినా ‘కో వర్కర్ లేదా కో అపరేటివ్ ప్లాట్‌ఫామ్’ గానే పనికొస్తుంది తప్ప మనుషులను అది రిప్లేస్ చేయలేదు అని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్/ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిలింద్ లక్కడ్ అన్నారు. ఏఐ టూల్స్.. బిజినెస్ మోడల్స్‌ను మార్చలేవని, ప్రొడక్టివిటీని పెంచడానికి మాత్రమే సహాయపడతాయని ఆయన అన్నారు.
చాట్ జీపీటీ వల్ల భవిష్యత్ ఉద్యోగావకాశాలు దెబ్బ తింటాయన్న భయాలు అవసరం లేదని పలు రంగాల నిపుణులు కూడా చెప్తున్నారు. ఇటీవలి కాలంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల తీసివేతకు ఇది కారణం కాదని కూడా నిపుణులు చెప్తున్నారు.
అయితే ఏఐ టూల్స్ వల్ల థర్డ్ పార్టీ కన్సల్టెంట్‌లు, మేనేజిరియల్ ఎక్స్‌పర్ట్స్ అవసరం తగ్గొచ్చని, టెక్నికల్ లేదా సపోర్ట్ విభాగాల్లోని ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని టెక్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతన్నారు.
ఏఐ అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఏఐ ఆపరేటింగ్‌కు సంబంధించిన టూల్స్ నేర్చుకున్నవారికి, మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్‌కు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని, అలాగే సొంతంగా స్టార్టప్‌లు పెట్టాలనుకునేవాళ్లకు ఏఐ టూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.
ChatGPT,openAI,Jobs
ChatGPT, OpenAI, jobs, Will jobs be lost with ChatGPT, Will ChatGPT replace your job, Telugu News, Telugu Global news, చాట్ జీపీటీ, చాట్ జీపీటీతో ఉద్యోగాలు పోతాయా, కంటెంట్ రైటింగ్, ఫోటో ఎడిటింగ్
https://www.teluguglobal.com//business/will-jobs-be-lost-with-chatgpt-what-do-the-experts-say-894403