చాట్ జీపీటీ సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే..

https://www.teluguglobal.com/h-upload/2023/03/21/500x300_727756-chat.webp

2023-03-21 15:13:28.0

మనదేశంలో చాట్‌జీపీటీ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ చార్జీ 20 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1650గా ఉంది.

వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులరైన చాట్‌జీపీటీ ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌కు ‘చాట్‌జీపీటీ ప్లస్‌’ అనే పేరు పెట్టింది ఓపెన్ ఏఐ సంస్థ. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో లేటెస్ట్‌ మోడల్‌ ‘జీపీటీ4’తో సహా అన్నిరకాల చాట్‌జీపీటీ సేవలు పొందొచ్చు. ఇండియాలో చాట్ జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ రేటు ఎంతంటే..

చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీస్ గత నెలలో అమెరికాలో మొదలైంది. రీసెంట్‌గా ఇండియన్ మార్కెట్‌లోకి కూడా వచ్చేసింది. మనదేశంలో చాట్‌జీపీటీ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ చార్జీ 20 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1650గా ఉంది. ఇప్పటి వరకు యూజర్లకు ఫ్రీగా చాట్‌జీపీటీ సేవలు లభించేవి. కానీ, ఇకపై అలా కుదరదు.

సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటేనే చాట్ జీపీటీతో చాట్ చేయడం కుదురుతుంది. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం వల్ల మరింత ఈజీగా, ఫాస్ట్‌గా చాట్‌జీపీటీ సేవలు పొందొచ్చు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో కూడా జీపీటీ4 ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.

ఇందులో యూజర్ల ప్రశ్నలకు వేగంగా స్పందించే ‘టర్బో ఆప్టిమైజ్డ్‌ లాంగ్వేజ్ మోడల్’ ఉంటుంది. చాట్‌జీపీటీ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు లేటెస్ట్‌ మోడల్‌ జీపీటీ4 సేవలు కూడా అందుకోవచ్చు. ఇందులో ఫోటో, వీడియోకు సంబంధించిన టూల్స్ కూడా ఉన్నాయి. అయితే రిక్వెస్టులు ఎక్కువగా ఉండడం వల్ల సబ్‌స్క్రిప్షన్ కోసం వెయిట్ లిస్ట్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. త్వరలోనే తక్కువ ధరల్లో మరిన్ని ప్లాన్స్ తీసుకొస్తామని ఓపెన్ ఏఐ సంస్థ చెప్తోంది.

ChatGPT,ChatGPT Plus,ChatGPT Plus Price,ChatGPT 4

https://www.teluguglobal.com//science-tech/how-much-is-chat-gpt-subscription-895909