2024-11-29 08:58:14.0
హిందువులను, వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్నయ్ కృష్ణదాస్‌కు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్న హిందూ ఆధ్యాత్మిక సంస్థ
https://www.teluguglobal.com/h-upload/2024/11/29/1381966-iskcon.webp
ఇస్కాన్‌కు చెందిన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్‌లో అరెస్టైన విషయం విదితమే. అయితే ఈ ఘటనతో బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ ఆయనకు దూరంగా ఉందని వస్తున్న వార్తలను హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఖండించింది. చిన్నయ్ కృష్ణదాస్‌కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొన్నది. దేశంలో హిందువుల హక్కులను పరిరక్షించడానికి తామంతా నిరంతరం కృషి చేస్తామని తెలిపింది.
హిందువులను, వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్నయ్ కృష్ణదాస్‌కు ఇస్కాన్ మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మాది శాంతి, ప్రేమ గల భక్తి ఉద్యమం. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఇస్కాన్ పేర్కొన్నది.
బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు కల్పిత, హానికరమైన ప్రచారాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు సమాజంలో మా సంస్థను అప్రతిష్ఠపాలు చేయడానికి, అశాంతిని సృష్టించడానికి చేస్తున్నట్లు ఉన్నదని సంస్థ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్ అన్నారు. అయితే చిన్నయ్ కృష్ణదాస్ ప్రవర్తన కారణంగా ఇస్కాన్‌లోని అన్నికార్యకలాపాల నుంచి అతడిని తొలిగించామని.. ఆయన చేసిన వ్యాఖ్యలతో, నిరసన కార్యక్రమాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని చంద్రదాస్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన నిరసన కార్యకలాపాల్లో ఇస్కాన్ ప్రమేయం లేదని బంగ్లాదేశ్‌మీడియా వర్గాలు పేర్కొన్న అనంతరం ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఇస్కాన్‌కు చెందిన చిన్నయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసకు నిరసనగా గత నెలలో చిట్టగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఆయనను ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీన్నివ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.ఇస్కాన్‌పై నిషేధించడానికి బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో హిందూ సంస్థ కార్యకాలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
ISKCON issues,Clarification,on Chinmoy Krishnadas,Arrest in Bangladesh: Not distancing. Supporting his rights