2024-12-15 07:22:27.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/15/1386072-ffsdsdfdfa.webp
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా తానే కారు డ్రైవ్ చేసుకుంటూ చిరు ఇంటికి వెళ్లిన బన్నీ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. తాజా పరిణామాలు బన్నీ, చిరుకు వివరించారు. అనంతరం బన్నీ అరెస్ట్‌పై చిరు ఆరా తీశారు. అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అరవింద్, తల్లి, భార్య, పిల్లలు కూడా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. కాగా నిన్న జైలు నుంచి విడుదలైన బన్నీని సినీ ప్రముఖులంతా కలిసి సంఘీభావం తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు.
Megastar Chiranjeevi,Allu Arjun,Chikkadapally Police,Chanchalguda Jail,Sandhya Theatre,High Court,Nampally Court,High Court Interim Bail