చిరంజీవిని కలిసిన నాగార్జున..ఎందుకంటే?

 

2024-10-25 06:19:41.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/25/1372279-nagarjuna-megastar.webp

ఈ వేడుకను మరుపురానిదిగా చేద్దామంటూ పోస్ట్‌

కింగ్‌ నాగార్జున మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. త్వరలో జరగనున్న ఏఎన్నార్‌ అవార్డుల కార్యక్రమానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. విషయాన్ని తెలియజేస్తూ ఈ ఫొటోలను నాగార్జున సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.’ఈ సంవత్సరం నాకు ప్రత్యేకమైనది. మా నాన్న శతజయంతి వేడుకకు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌ రావడం మరింత గౌరవంగా మారనుంది. ఈ వేడుకను మరుపురానిదిగా చేద్దాం’ అని పేర్కొన్నారు.

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 100వ పుట్టినరోజు వేడుకలను అక్కినేని ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే ఈ ఏడాది ఏఎన్నార్‌ అవార్డును ఎవరికి ఇవ్వబోతున్నారో కింగ్‌ నాగార్జున అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవికి అక్టోబర్‌ 28న బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. ఆ వేడుకకు అమితాబ్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. నాగార్జున పంచుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌ ఇద్దరు అగ్రహీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసి వారి అభిమానులు ఫిదా అవుతున్నారు. 

 

Nagarjuna,Invites,MegaStar Chiranjeevi,ANR Award national award function