2023-06-20 09:31:41.0
https://www.teluguglobal.com/h-upload/2023/06/20/785384-rain-kavitha.webp
సూర్య కిరణాలు దాటుకుంటూ
మబ్బులతోఆకాశం
మేఘాలుకమ్మకున్నాయి,
ఒక ప్రక్క ఆనందం
మరో పక్క ఆశ్చర్యం!
వేసవి ఎండ నుంచి చల్లని మబ్బులు
ఆకాశమంతా ఆహ్లాదంగా పరుచుకుని
వరుణుడుకి స్వాగతం పలికాయి
చిరు జల్లులు
హృదయాల సవ్వడి నిండా
ఆనందామృతవర్షిణి
రాగ జల్లులు నింపి
మరో స్వర్గపు ఆనందాల తో
అమృత అపూర్వ భావాలు
మనసు అంతా మల్లెల జాజుల మరువము గులాబీ సంపెంగ చందన పరిమళ సౌరభాలు
ప్రకృతి నుంచి మానవ హృదయ అంతరపు పొరలలో
శాశ్వత చిత్రాలు గా కవుల కలాలు
గాయక గళాలు
నాట్య కారులు ఆనందాలు
చిత్ర కారుల చిత్రాలకు
శిల్ప కారుల శిల్పాలకు
కళాకారుల హృదయాలు
రంజింప చేసిన చిరుజల్లులు
భూమాత పులకించి పరవశించి
కొత్తమొలకల కు దీవెనలు
మానవాళి పలికే
మేఘరంజని రాగ స్వరాల
ప్రకృతి ఆలాపన లో
స్వాగతము
సుస్వాగతము
-నారు మంచి వాణి ప్రభాకరి
(తణుకు)
Chiru Jallulu,Telugu Kavithalu,Narumanchi Vani Prabhakari