https://www.teluguglobal.com/h-upload/2024/11/03/1374468-accident-in-chattisgud.webp
2024-11-03 05:37:03.0
ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రామ్‌పూర్‌లో జరిగిన ఘటన
ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రామ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్నకారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. బుధబాగిచా ప్రాంతం నుంచి సూరజ్‌పూర్‌కు వెళ్లుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
స్థానికులు, పోలీసులు సిబ్బంది సహాయంతో చెరువులో ఉన్న వాహనాన్ని బయటకు తీశారు. వాహనంలోనే ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Chhattisgarh,Eight Killed,Car Falls Into Pond,In Balrampur