చేయని తప్పుకి ఆసుపత్రి సిబ్బందిని దారుణంగా కొట్టిన పోలీసులు

2024-12-27 15:31:47.0

చేయని తప్పుకి అక్కడ నిమ్స్ ఆసుపత్రి లో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు.

హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చేయని తప్పుకి అక్కడ ఓ కాంట్రాక్ట్ కార్మికున్నిపోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ ఆస్పత్రి సిబ్బంది నిరసన చేపట్టారు. ఇవాళ ఓపేషెంట్ ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం నిమ్స్‌కు వచ్చారు. ఈ క్రమంలో స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా రోగి బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో అతను.. డ్యూటీలో కాంట్రాక్ట్ కార్మికున్నికి మీద అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఎంక్వైరీలో భాగంగా నిమ్స్‌ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టారని ఇతర సిబ్బంది ఆరోపించారు. చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది.

దీంతో పూర్తిగా నిర్ధరణకు రాకుండానే దొంగతనం పేరుతో వర్కర్‌ను పోలీసులు కొట్టారని అత్యవసర విభాగం వద్ద సిబ్బంది నిరసనకు దిగారు. అనంతరం ఆ పేషంట్ ఇన్నర్ పాకెట్లోనే పోయింది అనుకుంటున్న బంగారు గొలుసు దొరికింది. ఇక ఎటువంటి విచారణ లేకుండా పోలీసులు ఈ విధంగా మాములు కార్మికుడినీ కొట్టడాన్ని ఖండిస్తున్నాయి కార్మిక సంఘాలు. కనీసం అతను ఎవరి కింద పని చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ కి.. లేదా నిమ్స్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇవ్వకుండా కార్మికున్ని పోలీసులకు అప్పగించింది అత్యవసర విభాగం. అయితే ప్రస్తుతం ఆ పోలీసుల చేతులో దెబ్బలు తిన్న ఆ కార్మికుడు నిమ్స్ ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నాడు.

Hyderabad,Panjagutta,Nimes Hospital,gold chain,MRI scanning,Panjagutta Police,Emergency department,Nimes Emergency,CM Revanth reddy,minister damodara raja narasimha,Nims director beerappa