https://www.teluguglobal.com/h-upload/2022/12/20/500x300_432021-coronavirus.webp
2022-12-20 11:55:59.0
ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. అయితే చైనాలో సీన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అక్కడ రోజురోజుకీ కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు చైనా మీడియా ద్వారా తెలుస్తోంది.
ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. అయితే చైనాలో సీన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అక్కడ రోజురోజుకీ కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు చైనా మీడియా ద్వారా తెలుస్తోంది. అయితే వైరస్ చైనాకు మాత్రమే పరిమితమవుతుందా? లేదా ఇతరదేశాలకు పాకుతుందా? అన్న భయం ఇప్పుడు అందర్నీ వెంటాడుతుంది.
చైనాలో రీసెంట్‌గా తీసుకొచ్చిన ‘జీరో-కొవిడ్’ విధానాన్ని అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకించడంతో నిబంధనలను సడలించారు. దాంతో అక్కడ కరోనా మహమ్మారి మరోసారి తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం అక్కడ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వైరస్ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయయాని వార్తలొస్తున్నాయి.
వచ్చే మూడు నెలల్లో చైనాలో 60శాతం మందికి పైగా వైరస్ బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో రోగులతో నిండిపోయిన ఓ హాస్పిటల్ ఫొటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
దాదాపు నాలుగు నెలల తర్వాత బీజింగ్‌లో మళ్లీ మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ మరణాల సంఖ్య చైనా అధికారికంగా ప్రకటించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్‌లోనే 2,700 మంది చనిపోయినట్లు హాంకాంగ్ మీడియా కథనాలు చెప్తున్నాయి.
బీజింగ్‌లోని కొన్ని శ్మశానవాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. రోజుకు సగటున 200 మృతదేహాలు వస్తున్నట్లు ఆ శ్మశానవాటికలో పనిచేసే సిబ్బంది చెప్పారని ఆ కథనం వెల్లడించింది. అలాగే బీజింగ్‌లోని ఫార్మా షాపుల్లో మందుల కొరత కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది.
Coronavirus,China,Coronavirus in China,Covid 19
Coronavirus, Coronavirus news, Coronavirus news in telugu, covid, covid 19, China, Coronavirus in China, China coronavirus news, telugu news, latest telugu news, Coronavirus disease, కరోనా, చైనా మళ్లీ కరోనా, చైనా కరోనా, కరోనా చైనా
https://www.teluguglobal.com//health-life-style/china-coronavirus-news-coronavirus-again-in-china-hospitals-are-full-553264