2023-05-21 12:29:19.0
https://www.teluguglobal.com/h-upload/2023/05/21/767888-chotu.webp
ఇంత
చోటు పెట్టమని
ప్రాధేయ పడితే
ఎవరో ఒకరు
ఒకింత
దయతలచక పోరు.
కానీ
నాకు కావాల్సింది.
లోపల.
పడుకునే ముందు
కుక్క
తన చుట్టూ తానే
గిర గిరా
తిరుగాడినట్టు
నా లోపల
నేనే..
– శిఖామణి
Shikhamani,Telugu Kavithalu