2025-03-04 08:48:11.0
11 సారి టాస్ ఓడిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీస్ మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది.భారత్ 14 వసారి టాస్ ఓడగా.. కెప్టెన్‌గా రోహిత్‌కు 11 సారి కావడం గమనార్హం. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత జట్టునే ఫేవరేట్‌గా తాను పరిగణిస్తున్నానని పేర్కొన్నాడు. కానీ కీలకమైన మ్యాచ్‌ల్లో ఆసీస్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేమన్నారు. ఐసీసీ రివ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ గేమ్ భారత్ ఫేవరేట్ గానే మొదలుపెట్టనున్నది. ఎందుకంటే వారు ఎక్కడికీ ప్రయాణించలేదు. ఈ వికెట్ పైనే ప్రాక్టీస్ చేశారు. కానీ ఆస్ట్రేలియా మాత్రం హడావుడిగా దుబాయ్ చేరుకున్నదన్నారు. ఇక వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ప్రతీకారం తీర్చుకుని లెక్క సరిచేయాలని భారత్ తపనతో ఉన్నది. ఆసీస్ ప్రధాన పేస్ దళం గాయాలబారిన పడి ఆటకు దూరంగా కావడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. కానీ భారత్ వైపు బుమ్రా లేకపోవడం లోపమే అయినా స్పీన్ ఆటగాళ్లు జట్టును ముందుండి నడిపించడం సానుకూల అంశంగా మారింది.
Australia vs India,1st Semi-Final at Dubai,Champions Trophy,Steven Smith,Rohit Sharma