2022-12-03 06:30:48.0
తాజాగా ఆయన దర్శకత్వం వహించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీకి గాను ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే `ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్` అవార్డు ఈ చిత్రానికి గాను ఆయనకు అందజేశారు.
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీకి గాను ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే `ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్` అవార్డు ఈ చిత్రానికి గాను ఆయనకు అందజేశారు. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును రాజమౌళి అందుకున్నారు.
వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఆన్‌లైన్ పబ్లికేషన్లకు సంబంధించిన పలువురు ప్రముఖులు బృందంగా ఏర్పడి సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరచినవారికి ఈ అవార్డులను అందజేస్తున్నారు. 1935 నుంచి వారు ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ని రూ.400 కోట్లతో తెరకెక్కించగా, రూ.1200 కోట్లు రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించిన ఈ సినిమా.. ఇప్పటికే శాటర్న్, సన్‌సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. మరోవైపు ఈ సినిమా ఆస్కార్ బరిలోకి కూడా దిగిన విషయం తెలిసిందే. దాదాపు 14 విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ బరిలో పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న రాజమౌళికి సినీ అభిమానులు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.