2022-06-05 23:00:23.0
ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వింటే.. సీక్రెట్లు కనిపెట్టడంలో మోడీ, అమిత్ షా కంటే తానే తెలివైన వాడిని అని విష్ణువర్థన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఉంది. మైండ్ గేమ్‌లో భాగంగానే జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారన్నది విష్ణు ఆరోపణ. ఆత్మకూరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో పాటు.. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాల ఏపీ పర్యాటన ఖరారైన సమయంలోనే జగన్ […]
ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వింటే.. సీక్రెట్లు కనిపెట్టడంలో మోడీ, అమిత్ షా కంటే తానే తెలివైన వాడిని అని విష్ణువర్థన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఉంది. మైండ్ గేమ్‌లో భాగంగానే జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారన్నది విష్ణు ఆరోపణ. ఆత్మకూరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో పాటు.. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాల ఏపీ పర్యాటన ఖరారైన సమయంలోనే జగన్ ఢిల్లీ టూర్ చేయడం ద్వారా.. బీజేపీతో వైసీపీకి మంచి సంబంధాలున్నాయన్న భావన కలిగించేందుకు ప్రయత్నించారని విష్ణు ఆరోపించారు.
ఏపీలో బీజేపీ కీలకమైన నిర్ణయాలకు సిద్ధమైన ప్రతిసారీ ఇలా ఢిల్లీ వెళ్లడం ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించడం చేస్తున్నారని విమర్శించారు. పైగా ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నిక ఉండడంతో మూడేళ్లుగా కేంద్ర పెద్దలతో టచ్‌లో ఉన్నాం, నిరంతరం తమ మధ్య చర్చలు జరుగుతున్నాయన్నట్టు పరోక్షంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. అలా ప్రచారం చేయడం ద్వారా బీజేపీ, వైసీపీ రెండు ఒకటే కదా అన్న భావన కలిగించి, బీజేపీ బలపడకుండా చేసే కుట్రగా అభివర్ణించారు.
సరే.. విష్ణు అనుమానాలు నిజమే అనుకుందాం. మరి ఆ విషయం మోడీ, అమిత్ షాలకు తెలియదా!. పైగా జగనేమీ ఢిల్లీ టూర్ వెళ్లింది అక్కడి వీధుల్లో సికార్లు చేయడానికి కాదు కదా!. మోడీ, అమిత్ షాను కలిసేందుకు. జగన్ ఏపీలో బీజేపీని దెబ్బతీసేందుకే ఢిల్లీ టూర్ పెట్టుకుని ఉంటే.. మరి మోడీ, అమిత్ షా ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సరే ఏపీ బీజేపిని దెబ్బతీసేందుకే.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీతో మంచి సంబంధాలున్నాయని ఏపీ మంత్రులు పరోక్షంగా ప్రచారం చేస్తున్నారే అనుకుందాం. మరి ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ చేసిన కామెంట్ సంగతేటి?.
జగన్‌ను చూస్తే నరేంద్రమోడీ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు.. ఒక కొడుకులా భావిస్తారని ఆమే చెప్పారుగా!. అంటే నిర్మాల సీతారామన్ కూడా వైసీపీ మంత్రులతో చేతులు కలిపి ఈ ప్రచారం చేశారని అనుకోవచ్చా!. అయినా 2019 ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లతో సరిపెట్టుకుని, తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో కంగుతిన్న పార్టీని బలహీనపరిచేందుకు ప్రత్యేకంగా జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారంటే నమ్మకం కష్టమే.
AP,ap cm jagan,BJP leader,Made some Comments,Vishnuvardhan Reddy,Visit to Delhi