2022-05-30 04:55:04.0
పెద్దల సభగా చెప్పుకునే శాసనమండలి సభ్యులు కూడా చాలా వైలెంట్‌గానే రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంకుశం సినిమాలో విలన్‌ని రోడ్డు మీద కొట్టినట్టు.. తాను కూడా అచ్చెన్నాయుడిని రోడ్డుపై ఈడ్చిఈడ్చి కొడతానంటూ ప్రకటించారు. అచ్చెన్నాయుడి రాజకీయ పతనమే తన జీవిత ఆశయమని ఎమ్మెల్సీ ప్రకటించారు. జగన్ కోసం తాను ఆత్మాహుతిదళంగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. తనకు ప్రాణం మీద భయం లేదని, జీవితం […]
పెద్దల సభగా చెప్పుకునే శాసనమండలి సభ్యులు కూడా చాలా వైలెంట్‌గానే రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంకుశం సినిమాలో విలన్‌ని రోడ్డు మీద కొట్టినట్టు.. తాను కూడా అచ్చెన్నాయుడిని రోడ్డుపై ఈడ్చిఈడ్చి కొడతానంటూ ప్రకటించారు. అచ్చెన్నాయుడి రాజకీయ పతనమే తన జీవిత ఆశయమని ఎమ్మెల్సీ ప్రకటించారు.
జగన్ కోసం తాను ఆత్మాహుతిదళంగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. తనకు ప్రాణం మీద భయం లేదని, జీవితం అంటే ఆశ లేదని దువ్వాడ శీను చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ వారిని వదిలిపెట్టబోమని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై దువ్వాడ ఇలా స్పందించారు. టెక్కలి రోడ్డుపై అచ్చెన్నాయుడిని ఉరికించి ఉరికించి కొట్టకపోతే తన పేరు దువ్వాడ శ్రీనివాసే కాదంటూ శపథం కూడా చేశారు.
మొన్నీమధ్యే చంద్రబాబుకు రక్షణగా ఆత్మహుతి దళాన్ని సిద్దం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు. ఇప్పుడు జగన్ తరఫున ఆ పాత్రకు దువ్వాడ సిద్ధమయ్యారు. అధినేత పట్ల అపారమైన భక్తి ప్రదర్శించి మెప్పుపొందే ఎత్తుగడ ఇటీవల అన్ని పార్టీల నేతల్లోనూ పెరుగుతోంది. అందుకే పనికొచ్చే మాటలు, పనులు కాకుండా.. ఇలా ఆత్మహుతిదళాలు అంటూ పనికి రాని ప్రకటనలు చేస్తున్నట్టుగా ఉంది.
against,atchannaidu,duvvada srinivas,MLC,sensational comments,TDP President,ycp