2025-01-30 13:38:51.0
వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని అప్పుడు టీడీపీ కార్యకర్తల తాట తీస్తామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు
https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398939-peddi-reddy.webp
వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు టీడీపీ కార్యకర్తల తాట తీస్తామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. వైసీపీ సమన్వయ సమావేశంలో టీడీపీ కార్యకర్తలకు పెద్దిరెడ్డి హెచ్చరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందని అన్నారు. సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతామని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలపై చేసిన దాడులకు కచ్చితంగా ప్రతిదాడులు ఉంటాయని చెప్పారు.
తమ తడాఖా ఏందో రుచి చూపిస్తామని అన్నారు. ఇకపై ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని జగన్ చెప్పారని… ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామచంద్రారెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపైపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు.