2024-12-28 14:12:43.0
బ్యాంకింగ్ లావాదేవీల కోసం అవి ఎప్పుడెప్పుడో తెలుసుకోవాల్సిందే
కొత్త సంవత్సరంలోకి ఇంకో మూడు రోజుల్లో అడుగు పెట్టేస్తున్నాం. కొత్త క్యాలెండర్.. కొత్త రెజల్యూషన్స్.. రిఫ్రెష్ మూడ్.. సెలబ్రేషన్స్.. ఇవన్నీ ఒక వైపు.. కొత్త ఏడాదిలోకి ఎంటర్ అవుతూనే బ్యాంకుల సెలవుల గురించి కూడా కాస్త తెలుసుకోవాల్సిందే.. ఎందుకు అంటారా? జనవరిలో బ్యాంకులకు సగం రోజులు సెలవులే మరి. అవును..! జనవరిలో మొత్తంగా బ్యాంకులకు 16 రోజులు సెలవులున్నాయి. కానీ ఒక్కో రాష్ట్రంలో కొన్ని సెలవులు ఉండవు. ఎట్లా చూసుకున్నా తెలుగు రాష్ట్రాల్లో కనీసం పది రోజులు బ్యాంకుల తలుపులు తెరుచుకోవు. సాధారణంగా ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవులు. జనవరిలో వీటికి అదనంగా న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే సహా పలు పండుగలు, నేషనల్ ఈవెంట్లు ఉన్నాయి. జనవరిలో ఉన్న బ్యాంక్ హాలిడేస్ ఏమిటో ఓ లుక్కేద్దాం..
జనవరి 1 (బుధవారం) : న్యూ ఇయర్
జనవరి 2 (గురువారం) : మన్నం జయంతి (స్టేట్ హాలిడే)
జనవరి 5 : ఆదివారం
జనవరి 6 (సోమవారం) : గురుగోవింద్ సింగ్ జయంతి
జనవరి 11 (శనివారం) : రెండో శనివారం
జనవరి 12 (ఆదివారం) : స్వామి వివేకానంద జయంతి
జనవరి 13 (సోమవారం) : లోహ్రి, భోగి
జనవరి 14 (మంగళవారం) : మకర సంక్రాంతి, మాగ్ బిహు, పొంగల్
జనవరి 15 (బుధవారం) : తిరువళ్లూవర్ దినోత్సవం తుసు పూజ
జనవరి 16 (గురువారం) : ఉజ్జవల్ తిరునాల్
జనవరి 19 : ఆదివారం
జనవరి 22 (బుధవారం) : ఇమోయిన్
జనవరి 23 (గురువారం) : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
జనవరి 25 (శనివారం) : నాలుగో శనివారం
జనవరి 26 (ఆదివారం) : రిపబ్లిక్ డే
జనవరి 30 (గురువారం) : సోనమ్ లోసర్
Banks,Holidays,January,Festivals,National Events