2025-01-11 11:33:02.0
ఈ ఫెస్టివల్‌లో 50 దేశాలకు చెందిన సుమారు 150 మంది ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జనవరి 13 నుంచి 15 వరకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందినవారు స్వీట్ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. ఇండోనేషియా, శ్రీలంక, ఖాట్మండు, స్కాట్‌లాండ్, మలేసియా, ఇటలీ, సౌతాఫ్రికా, నెదర్లాండ్ సహా మొత్తం 50 దేశాలకు చెందిన సుమారు 150 మంది ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. ఈ మూడు రోజులు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా పాల్గొనవచ్చు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబించేలా ఫెస్టివల్ ఉంటుంది. సంస్కృతిలో భాగమే ఈ పండుగలు. గ్రామాల్లో కూడా సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. తెలంగాణలోని ప్రాచీన కట్టడాలు, దేవాలయాలను పర్యటించాలి. తెలంగాణ టూరిజం అందుకు తోడ్పాటు అందిస్తుందని మంత్రి జూపల్లి తెలిపారు.
TelanganaTourism,Telangana Zarur Aana,International Kite Festival. Sweet Festival,KiteFestival2025,SweetTreats,Parade Grounds,Secunderabad