జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : ప్రశాంత్‌ కిశోర్‌

2024-12-30 09:34:37.0

పాట్నాలో పోలీసుల చర్యలకు నిరసనగా జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు.

https://www.teluguglobal.com/h-upload/2024/12/30/1390237-prashanth.webp

బిహార్ రాజధాని పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థులపై జరిగిన లాఠీఛార్జీని జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఖండించారు. కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌పై పోరాడుతున్న యువతపై పోలీసులు అనుసరించిన వైఖరి సరికాదని తెలిపారు. జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే సరిగ్గా లాఠీఛార్జీ జరిగే సమయంలో అక్కడ లేకుండా ప్రశాంత్‌ కిశోర్‌ వెళ్లిపోయారని విద్యార్ధులు ఆరోపించారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని ప్రకటించారు.లాఠీఛార్జి జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు?కాగా ఆదివారం రాత్రి పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తున్న సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ అక్కడినుంచి వెళ్లిపోతునన్నట్లుగా పలు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో విద్యార్థులకు, ఆయనకు మధ్య వాగ్వాదం నెలకొంది. తమపై పోలీసులు లాఠీఛార్జి చేసేటప్పుడు అక్కడ ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారని అభ్యర్థులు ఆయనను ప్రశ్నించారు. నిరసన ప్రాంతం నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా విద్యార్థులు తనపై చేసిన ఆరోపణలను ప్రశాంత్‌ కిశోర్‌ ఖండించారు. విద్యార్థుల ఉద్యమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. పోలీసులు లాఠీఛార్జి చేస్తుండడంతో విద్యార్థులను అక్కడినుంచి వెళ్లాలని సూచిస్తూ తాను మరో చోటికి వెళ్లాని ప్రశాంత్ కిశోర్ క్లారిటీ ఇచ్చారు.

Prashant Kishore,Suraj’s party,BPSC,Bihar,Patna,Social media,National Human Rights Commission,Bihar CM Nitish Kumar,JDU,RJD,Tejashwi yadav,BJP,PM Modi,Question paper leak