2024-12-12 08:10:31.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/12/1385213-dhanush-nayanatara.webp
‘నయనతార:బియాండ్ ది ఫెయిరీ టేల్’ వివాదంలో నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందానికి కోర్టు నోటీసులు జారీ
‘నయనతార:బియాండ్ ది ఫెయిరీ టేల్’ వివాదంలో భాగంగా నటుడు ధనుష్ ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులపై ఆయన దావా వేశారు. కోర్టు తాజాగా దీనిపై విచారణ చేపట్టింది. జనవరి 8వ తేదీలోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది.
వివాదం ఏమిటంటే?
నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘నయనతార:బియాండ్ ది ఫెయిరీ టేల్’ . తన అనుమతి తీసుకోకుండా ఇందులో ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్‌ను వినియోగించుకున్నారని ఆరోపిస్తూ మూవీ ప్రొడ్యూసర్, హీరో ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నయనతార ధనుష్ క్యారెక్టర్‌ను తప్పుపట్టడం, తనపై ఆయన ద్వేషం చూపెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. లీగల్ నోటీసులు పంపినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలు ఉపయోగించడంపై ధనుష్ మండిపడ్డారు. నయన్ దంపతులపై కోర్టులో దావా వేశారు.
Nayanthara beyond the fairy tale,Court has directed,Nayanthara,Vignesh Shivan,and Netflix,Respond to the case by January 8,Dhanush and Nayanthara Controversy