జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారి వీర మరణం

2024-11-10 13:45:33.0

జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

https://www.teluguglobal.com/h-upload/2024/11/10/1376599-ecounter.webp

జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. కిష్ట్‌వార్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌ (జేసీవో) నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ వీర మరణం పొందినట్లు ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ పేర్కొన్నారు. మరో ముగ్గురు కమాండోలు గాయపడినట్లు తెలిపారు. కిష్త్వార్‌లో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌లో భాగమైన నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ ఎంతో ధైర్యంతో ఉగ్రవాదులతో పోరాడి అమరుడైనట్లు వైట్ నైట్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వెల్లడించింది. ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులు మరణించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.