జమ్మూకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు ..ముగ్గురు జవాన్లు మృతి

2024-09-20 15:55:56.0

జమ్మూకశ్మీర్‌లో సైనికులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.

https://www.teluguglobal.com/h-upload/2024/09/20/1361343-jamu.webp

జమ్మూకశ్మీర్‌లో సైనికులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. బుద్గామ్ జిల్లాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు ప్రయాణిస్తున్న బ్రెల్ వాటర్‌హైల్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి 40 అడుగుల లోయలోకి పడిపోయింది.32 మంది గాయపడ్డారు.అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు లోయలోకి దిగి బస్సులో చిక్కుకున్న వారిని కాపాడటానికి ప్రయత్నించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 18న తొలిదశ పోలింగ్‌ పూర్తికాగా.. రెండో దశ సెప్టెంబర్‌ 25న జరగనుంది. ఎన్నికల విధుల కోసం 110 మంది సిబ్బందితో కూడిన దాదాపు 900 కంపెనీలకు భద్రత బాధ్యతలు అప్పగించారు. ఇటీవల రాజౌరిలో ఆర్మీ వాహనం రోడ్డుపై నుంచి జారి లోతైన లోయలో పడిన మూడు రోజుల తర్వాత ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

Jammu and Kashmir,Three jawans died,Budgam District,BSF,Jammu Assembly Elections