2024-11-07 05:29:53.0
అసెంబ్లీలో యుద్ధ వాతావరణం
https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375505-jammu-assembly.webp
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో రసాభాస చోటు చేసుకున్నది. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై నేడు ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇవాళ సభా కార్యక్రమాలు మొదలుకాగానే ఇంజినీర్ రషీద్ సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనే బ్యానర్‌ను ప్రదర్శించాడు. దీంతో వివాదం రాజుకున్నది. ఈ చర్య పట్ల ప్రతిపక్ష నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా స్పందిస్తూ.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేకశక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాక్‌తో చేయి కలిపింది. ఉగ్రవాదులతో చేయి కలిపిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Jammu & Kashmir,Assembly Session,PDP MLA moves resolution,Against Article 370 abrogation,BJP protests