2023-03-22 02:41:36.0
https://www.teluguglobal.com/h-upload/2023/03/22/727787-shobhakrit.webp
శోభకృతమా జయహో జయహో
జయ జయ జయ జయహో
సుకర్మములు
జరిపించుటకు జయం
సుభాషితములు
పలికించుటకు జయం
సత్సంబంధములు
పెంపొందించుటకు జయం
సత్సాంగత్యములు
కల్పించుటకు జయం
విరోధములను
తొలగించుటకు జయం
వినాశనములను
అరికట్టేందుకు జయం
సిరిసంపదలు
సమృద్ధిగా పెరుగుటకు జయం
ఆకలిదప్పులతో
అలమటించకుండుటకు జయం
మమతానురాగాలు
అల్లుకొనుటకు జయం
సాటి మనస్సులు
గెలుచుకొనుటకు జయం
భువిలో అలజడులు
రేగకుండుటకు జయం
వివేకముతో విచక్షణతో
ప్రవర్తించుటకు జయం
విద్యావిజ్ఞాన వికాసముల
ఉన్నతికి జయం
సంపూర్ణ మానవుడిగా
జీవించుటకు జయం
ఆయురారోగ్య వంశాభివృద్ధి
జరుగుటకు జయం
విశ్వమానవ కళ్యాణమునకు
జయం జయం
శోభకృతములకు మము ప్రేరేపించవమ్మా
ఆవహించవమ్మా ఆహ్వానమమ్మా ఆహ్వానం!
– రవి కిషొర్ పెంట్రాల,
(లాంగ్లీ, లండన్)
Jayaho Shobhakruth,Telugu Kavithalu,Ravi Kishor Pentrala