2023-01-26 09:04:05.0
https://www.teluguglobal.com/h-upload/2023/01/26/720775-jaya-jaya.webp
అంతులేని దేశ భక్తితో
ఆలయంలో అర్చకుల్లా
అమ్మ భారతికి స్వేచ్ఛా
పుష్పాలతో పూజ చేసి
వేద భూమికి
వేల గొంతులతో
స్వాతంత్య్ర మంత్ర ఘోషతో
రుధిరాభిషేకాలు చేసిన
సమర వీరులకు జయహో
అమర యోధుల త్యాగఫలం
అరుల చేతికి చిక్కకుండా
పరుల పాలై పుణ్యభూమి
పతన దశకు జార కుండా
అవని కోసం అసువులైనా
అవలీలగా అర్పించే
దమ్ము గల ధీరులకు శూరులకు జయహో
అలసి పోయి
కునుకు తీయక
పోరు వస్తే పారిపోక
జన్మభూమి రక్షణ బద్దులై
సరి హద్దుల సంరక్షణ సన్నద్ధులై
సాయుధ దళములో సంసిద్దులై
సమర్ధులై విజయార్ధులైన
సిపాయిలకు జయహో
జన ప్రీతితో జవానులై
జగమంత కుటుంబం
మాదంటూ
జామురేయయినా
జగతి మొత్తం జోగుతున్నా
జాగోరె జాగంటూ జాతి కోసం జాగిలాల్లా కాపు కాసే
సాటిలేని మేటి సైనికులకు
జయ జయ జయ జయహో.
-దుద్దుoపూడి అనసూయ
Duddumpudi Anasuya,Jay Jay Jay Ho,Telugu Kavithalu