జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండించిన : మంత్రి పొన్నం

2024-12-11 15:57:54.0

జల్ పల్లిలో జర్నలిస్ట్ పై నటుడు మోహన్ బాబు చేసిన దాడి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు

నటుడు మోహన్ బాబు ఇంటికి కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేయటం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జర్నలిస్టుల పట్ల అహంకార పూరితంగా వ్యవహరించిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దాడి ఘటనపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, మంచు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు గత నాలుగు రోజులుగా పీక్ స్టేజ్‎కు చేరాయి. కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా పై మంచు మోహన్ బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ముఖ్యంగా వారి చేతుల్లోని మైకులను లాక్కొని ఆవేశంతో నేలకేసి కొట్టారు. గేటు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేశాడు. ప్రధానంగా టీవీ-9 ప్రతినిధి రంజీత్ పై తీవ్రంగా దాడి చేశారు మోహన్ బాబు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు 

Minister Ponnam Prabhakar,Mohan Babu,Jal Palli,Telangana Goverment,CM Revanth reddy,Deputy cm Mallu Bhatti,hero Manchu Manoj,Manchu Vishnu,Bhuma maunika,Manchu Lakshmi,Rachakonda CP Office