జర్నలిస్ట్ హత్యను ఖండించిన ఎంపీ ప్రియాంక గాంధీ

2025-01-04 14:42:23.0

ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యను ఎంపీ ప్రియాంక గాంధీ ఖండించారు.

https://www.teluguglobal.com/h-upload/2025/01/04/1391632-priyanka.webp

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యకు గురవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ ఘటన తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఈ ఇష్యుపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా సరే వారికి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరింతమందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జర్నలిస్టు హత్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ప్రకటించారు.

MP Priyanka Gandhi,Mukhesh Chandrakar,Journalist Murder,Chatthisghar,Deputy CM Vijay Sharma,Bijapur,Congress party,Rahul gandhi,Chhattisgarh CM Vishnu Deo Sai,National news