2015-03-25 19:00:37.0
ప్రశ్న-జవాబు ప్రశ్న: ఏ ప్లేటు టిఫిన్ తినడానికి పనికిరాదో చెప్పు చూద్దాం. జవాబు: నేమ్‌ప్లేటు. ************ మరియున్నూ… ”కొంచెం శాంతంగా ఆలోచిస్తే చాలా మటుకు విడాకులు తప్పిపోతాయి”. అంది లాయర్ ఉష. కొలీగ్ నాగేశ్వర్రావ్‌తో. ”అలాగే పెళ్లిళ్లు కూడా” అన్నాడతను కూల్‌గా. ************ తాళం ”ఏమండీ నేను పాడతాను. మీరు తాళం వేయరూ” అడిగింది. ఆండాళ్లు. ‘ఓ ఎస్ అలాగే! మొదలెట్టు’ అని ఆవిడ పాట అందుకోగానే లేచి గది బయట గొళ్లెం పెట్టి, తాళం వేసి […]
ప్రశ్న-జవాబు
ప్రశ్న: ఏ ప్లేటు టిఫిన్ తినడానికి పనికిరాదో చెప్పు చూద్దాం.
జవాబు: నేమ్‌ప్లేటు.
************
మరియున్నూ…
”కొంచెం శాంతంగా ఆలోచిస్తే చాలా మటుకు విడాకులు తప్పిపోతాయి”. అంది లాయర్ ఉష. కొలీగ్ నాగేశ్వర్రావ్‌తో. ”అలాగే పెళ్లిళ్లు కూడా” అన్నాడతను కూల్‌గా.
************
తాళం
”ఏమండీ నేను పాడతాను. మీరు తాళం వేయరూ” అడిగింది. ఆండాళ్లు.
‘ఓ ఎస్ అలాగే! మొదలెట్టు’ అని ఆవిడ పాట అందుకోగానే లేచి గది బయట గొళ్లెం పెట్టి, తాళం వేసి వెళ్లిపోయాడా భర్త
************
డోర్‌బెల్
ఓ వ్యక్తి డోర్‌బెల్ పనిచేయడంలేదు రిపేరు చేయమని శాంతాసింగ్‌ను పిలిచాడు. నాలుగురోజులు తరువాత ఫోన్‌చేసి… రమ్మంటే రాలేదేమని అడిగాడు..దానికి శాంతాసింగ్… ”నేను రోజూ వచ్చి బెల్ కొడుతున్నా…మీరే తలుపులు తీయడంలేదు” అని బదులిచ్చాడు.
Comedy,Comedy in Telugu,Humour,Jokes,Jokes in Telugu,Telugu Comedy,Telugu Humour,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/03/26/జర-నవ్వండి-ప్లీజ్-11/