జర నవ్వండి ప్లీజ్ 140

2015-07-10 13:03:06.0

పితృభాష లేదెందుకో? చిన్నప్పటి నుంచి మనం మాట్లాడే భాషని మాతృభాష అంటారేకాని పితృభాష అనరెందుకని? డౌటొచ్చింది రాముకు. ఎందుకంటే తండ్రికి మాట్లాడే అవకాశం అతికష్టం మీద లభిస్తుంది కాబట్టి… డౌట్‌ క్లియర్‌ చేశాడు సతీష్‌. ————————————- నాన్న “కథలు” రాత్రి పది గంటలైంది. తల్లీ కొడుకులిద్దరికీ నిద్ర పట్టడం లేదు. కొడుకు అటు ఇటు దొర్లుతూ “మమ్మీ! నాకు నిద్ర రావడం లేదు. ఏదైనా కథ చెప్పవూ” అని తల్లిని అడిగాడు. కొంచెంసేపు ఆగమ్మా! మీ నాన్నగారొస్తారు. […]

పితృభాష లేదెందుకో?
చిన్నప్పటి నుంచి మనం మాట్లాడే భాషని మాతృభాష అంటారేకాని పితృభాష అనరెందుకని? డౌటొచ్చింది రాముకు.
ఎందుకంటే తండ్రికి మాట్లాడే అవకాశం అతికష్టం మీద లభిస్తుంది కాబట్టి… డౌట్‌ క్లియర్‌ చేశాడు సతీష్‌.
————————————-
నాన్న “కథలు”
రాత్రి పది గంటలైంది. తల్లీ కొడుకులిద్దరికీ నిద్ర పట్టడం లేదు. కొడుకు అటు ఇటు దొర్లుతూ “మమ్మీ! నాకు నిద్ర రావడం లేదు. ఏదైనా కథ చెప్పవూ” అని తల్లిని అడిగాడు.
కొంచెంసేపు ఆగమ్మా! మీ నాన్నగారొస్తారు. మనిద్దరికీ రకరకాల కథలు వినిపిస్తారు. (ఇంటికి లేటుగా వచ్చినందుకు వినిపించే కథలు)
————————————-
అసలు వాడం….
జీవిత: మా ఆయన పవన్‌కల్యాణ్‌; నేను శ్రియ వాడిన సబ్బలు వాడతాం… తెలుసా వదినా!
రాశి: అలాగా! మేం ఒకరు వాడేసిన సబ్బులు అస్సలు వాడం వదినా!

Humour,Jokes in Telugu,Telugu Jokes,జోక్స్‌,హ్యూమర్‌

https://www.teluguglobal.com//2015/07/11/jokes-in-telugu-140/