2015-07-18 13:03:58.0
ఫ్రీ ఆఫర్ ఒకావిడ తనకు మొగుడు కావాలంటూ పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. దానికి బదులుగా కుప్పలుతెప్పలుగా ఉత్తరాలు వచ్చి పడ్డాయి వాటన్నిటిలో సారాంశం ఒక్కటే “నా మొగుడ్ని తీసుకో”. ——————————————————————— స్వయంగా “గోపీ! మీ ఆవు పాలిస్తుందా?” అడిగాడు మాస్టారు. “అదివ్వదు సార్ మనమే పితుక్కోవాలి” అన్నాడు గోపి. ——————————————————————— ఒక్కదాన్నే కాబోయే అల్లుడిని పిల్ల తండ్రి అడిగాడు. “బాబూ ఒక కుటుంబాన్ని పోషించగల స్థోమతుందా?” దానికి అబ్బాయి “లేదండీ! నేను కేవలం మీ అమ్మాయి పోషణ […]
ఫ్రీ ఆఫర్
ఒకావిడ తనకు మొగుడు కావాలంటూ పత్రికల్లో ప్రకటన ఇచ్చింది.
దానికి బదులుగా కుప్పలుతెప్పలుగా ఉత్తరాలు వచ్చి పడ్డాయి
వాటన్నిటిలో సారాంశం ఒక్కటే “నా మొగుడ్ని తీసుకో”.
———————————————————————
స్వయంగా
“గోపీ! మీ ఆవు పాలిస్తుందా?” అడిగాడు మాస్టారు.
“అదివ్వదు సార్ మనమే పితుక్కోవాలి” అన్నాడు గోపి.
———————————————————————
ఒక్కదాన్నే
కాబోయే అల్లుడిని పిల్ల తండ్రి అడిగాడు. “బాబూ ఒక కుటుంబాన్ని పోషించగల స్థోమతుందా?”
దానికి అబ్బాయి “లేదండీ! నేను కేవలం మీ అమ్మాయి పోషణ చూసుకోగలను. మీ సంగతి మీరు చూసుకోవాలి” అన్నాడు కచ్చితంగా.
———————————————————————
కారణం
ఒకరు అడిగారు “నువ్వు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయావు?”
“మా అత్తగారికీ, మామగారికీ పిల్లలు పుట్టలేదు మరి”.
Humour,Jokes in Telugu,Telugu Jokes,జోక్స్,హ్యూమర్
https://www.teluguglobal.com//2015/07/19/jokes-in-telugu-148/