జర నవ్వండి ప్లీజ్ 153

2015-07-23 13:03:12.0

కిటికీలు బిల్‌గేట్స్‌ ఎందుకంత ధనవంతుడయ్యాడు? “కిటికీలు” (విండోస్)అమ్మడం వల్ల ————————————————- ఆదర్శం క్లర్కు: సార్‌! మీరొక్కరే పిల్లలకు పాఠం చెబుతున్నారు. తక్కిన టీచర్లు ఏరీ? టీచర్‌: వాళ్లు బెస్ట్‌ టీచర్‌ అవార్డు కోసం పైరవీలు చెయ్యడానికి వెళ్లారు. ————————————————- అతి తెలివి మొదటి వ్యక్తి: ఎందుకు ఎప్పుడూ నోట్‌బుక్‌ పెట్టుకుని ఉంటావు? రెండో వ్యక్తి: ఏదైనా కారు నన్ను గుద్దితే నెంబర్‌నోట్‌ చేద్దామని ————————————————- గతం “ఎందుకు మీరు దిగులుగా కనిపిస్తున్నారు?” “నా భవిష్యత్తు గురించి” “మీ […]

కిటికీలు
బిల్‌గేట్స్‌ ఎందుకంత ధనవంతుడయ్యాడు?
“కిటికీలు” (విండోస్)అమ్మడం వల్ల
————————————————-
ఆదర్శం
క్లర్కు: సార్‌! మీరొక్కరే పిల్లలకు పాఠం చెబుతున్నారు. తక్కిన టీచర్లు ఏరీ?
టీచర్‌: వాళ్లు బెస్ట్‌ టీచర్‌ అవార్డు కోసం పైరవీలు చెయ్యడానికి వెళ్లారు.
————————————————-
అతి తెలివి
మొదటి వ్యక్తి: ఎందుకు ఎప్పుడూ నోట్‌బుక్‌ పెట్టుకుని ఉంటావు?
రెండో వ్యక్తి: ఏదైనా కారు నన్ను గుద్దితే నెంబర్‌నోట్‌ చేద్దామని
————————————————-
గతం
“ఎందుకు మీరు దిగులుగా కనిపిస్తున్నారు?”
“నా భవిష్యత్తు గురించి”
“మీ భవిష్యత్తు గురించి దిగులుపడడానికి కారణం?”
“నా గతం!”

Humour,Jokes in Telugu,Telugu Jokes,జోక్స్‌,హ్యూమర్‌

https://www.teluguglobal.com//2015/07/24/jokes-in-telugu-153/