జర నవ్వండి ప్లీజ్ 168

2015-08-07 13:03:56.0

ఫోర్జరీ రాజు జైల్లో ఉన్న ఆరు నెలలు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. అంత తొందరగా చదువు నేర్చుకున్న అతడిని అందరూ మెచ్చుకున్నారు. కానీ జైలు నుంచి వెళ్లిన రాజు వారం రోజులు తిరిగేసరికి మళ్లీ వచ్చాడు. దాంతో తోటి ఖైదీలు “ఏంటి మళ్లీ వచ్చావు” అని అడిగారు. “ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నా” అన్నాడు రాజు. ————————————————————— పానీపూరీ ఇద్దరి స్నేహితుల మధ్య సంభాషణ ఇలా ఉంది. రిటైర్డ్‌ సైనికుల కాలనీ? “సైనిక్‌ పూరి” రిటైర్ట్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్ల […]

ఫోర్జరీ
రాజు జైల్లో ఉన్న ఆరు నెలలు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. అంత తొందరగా చదువు నేర్చుకున్న అతడిని అందరూ మెచ్చుకున్నారు. కానీ జైలు నుంచి వెళ్లిన రాజు వారం రోజులు తిరిగేసరికి మళ్లీ వచ్చాడు. దాంతో తోటి ఖైదీలు “ఏంటి మళ్లీ వచ్చావు” అని అడిగారు.
“ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నా” అన్నాడు రాజు.
—————————————————————
పానీపూరీ
ఇద్దరి స్నేహితుల మధ్య సంభాషణ ఇలా ఉంది.
రిటైర్డ్‌ సైనికుల కాలనీ?
“సైనిక్‌ పూరి”
రిటైర్ట్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్ల కాలనీ?
“వాయుపురి”
మరి రిటైర్డ్‌ నేవీ ఆఫీసర్స్‌ కాలనీని ఏమంటారు?
“పానీపురి”
—————————————————————
నిజం నక్లెస్‌
లవర్స్‌ డే రోజున గర్ల్‌ఫ్రెండ్‌కు నక్లెస్‌ ప్రజెంట్‌ చేశాడు నగేష్‌. అంతే ఆమె ఆనందం పట్టలేకపోయింది. “థాంక్స్‌! నగేష్‌. నిజంగా చాలా బావుంది. అద్భుతం” అంటూ పొగుడుతూ… “నిజంగా ఇది వజ్రాల నక్లెస్సా?” అని అడిగింది.
“అవును డియర్‌! లేకుంటే నీ కోసం నేను 50 రూపాయలు ఖర్చుపెడతానా?”
—————————————————————
టెంపర్‌మెంటల్‌
ఆఫీసులో ఇద్దరు మహిళలు తమ భర్తల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకావిడ “మా ఆయన అలా… ఇలా…” అని చెప్పుకుంటూ పోతోంది. మరో ఆవిడ కలుగజేసుకుని “మా ఆయన మాత్రం టెంపర్‌మెంటల్‌” అంది.
దానికి మొదటి ఆవిడ “అదేంటి, అదేం వర్ణన” అని అడిగింది.
“అంతే మరి మా ఆయన సగం టెంపర్‌. సగం మెంటల్‌. నేను అలాగే పిలుస్తాను” అది రెండో ఆవిడ.

Humour,Jokes in Telugu,Telugu Jokes,జోక్స్‌,హ్యూమర్‌

https://www.teluguglobal.com//2015/08/08/jokes-in-telugu-168/