2015-03-29 19:00:46.0
అతి ‘ఆవిడ చాలా డబ్బున్నది తెలుసా?’ ‘ఎట్లా చెబుతావు?’ ‘ఆమె పక్కింటికి కూడా కార్లో వెళుతుంది’ ************ భవిష్యత్ టీచర్: హిస్టరీ టీచరంటే ఎవరు? విద్యార్థి: ఫ్యూచర్ గురించి ఆలోచించని వాడు! ************* తెలివి టీచర్: ఈ క్లాసులో చాలా మంది తెలివి తక్కువవాళ్లు ఉన్నారు. తెలివి తక్కువ వాళ్లంతా లేచి నిల్చోండి క్లాసులో ఎవరూ లేచి నిల్చోలేదు టీచర్: అంటే క్లాసులో తెలివి తక్కువ వాళ్లే లేరా? ఒక విద్యార్థి: ఉన్నారు టీచర్ టీచర్: ఎవరు? […]
అతి
‘ఆవిడ చాలా డబ్బున్నది తెలుసా?’
‘ఎట్లా చెబుతావు?’
‘ఆమె పక్కింటికి కూడా కార్లో వెళుతుంది’
************
భవిష్యత్
టీచర్: హిస్టరీ టీచరంటే ఎవరు?
విద్యార్థి: ఫ్యూచర్ గురించి ఆలోచించని వాడు!
*************
తెలివి
టీచర్: ఈ క్లాసులో చాలా మంది తెలివి తక్కువవాళ్లు ఉన్నారు. తెలివి తక్కువ వాళ్లంతా లేచి నిల్చోండి
క్లాసులో ఎవరూ లేచి నిల్చోలేదు
టీచర్: అంటే క్లాసులో తెలివి తక్కువ వాళ్లే లేరా?
ఒక విద్యార్థి: ఉన్నారు టీచర్
టీచర్: ఎవరు?
విద్యార్థి: మీరే టీచర్. మీరొక్కరే నిల్చున్నారు.
*************
సాయం
ఎదుటివాళ్లకు సాయపడడం గురించి వినీత్ వ్యాసం రాశాడు.
‘ఎదుటి వాళ్లకు సాయపడడం మానవధర్మం. నేనెప్పుడూ ఎదుటివాళ్లకు, పక్కింటి వాళ్లకు కూడా సాయపడుతూ వుంటాను. ఒకరోజు మా పక్కింటి సుబ్బారావు గారు ఆఫీసుకు బయల్దేరారు. టైం చూసుకున్నారు. వేగంగా నడవడం మొదలు పెట్టారు. ఆయన బస్‌స్టాప్‌కు చేరడానికి పదినిమిషాలు పడుతుంది. ఆ రోజు ఆలస్యమయింది. బస్సును అందుకోలేనేమో అన్న ఆదుర్దా ఆయన ముఖంలో చూశాను. ఆయన పరిగెడితే కానీ అది సాధ్యంకాదు. ఆయనకు సాయపడడం నా ధర్మం అనిపించింది. ఆయన పరిగెత్తడానికి నేను సాయం చేశాను. ఆయనపైకి మా కుక్కని వదిలిపెట్టాను!
Comedy,Comedy in Telugu,Humour,Jokes,Jokes in Telugu,Telugu Comedy,Telugu Humour,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/03/30/jokes-in-telugu-19/