2015-04-03 19:00:34.0
మహా సోమరి ఒకడు మిత్రుడు కేరమ్స్ ఆడుతున్న చోటుకి వచ్చి అందర్నీ చూసి ‘మీలో ఎవరు సోమరిపోతో అతనికి ఐదు వందల నోటు యిద్దామనుకుంటున్నా’ అన్నాడు. వాళ్లలో ఒకడు ‘సరే! వచ్చి నా బ్యాక్ పాకెట్లో పెట్టు’ అన్నాడు. ************ డబ్బున్న డాక్టర్ మోహన్రావు: మా అమ్మాయి రూపాయి బిళ్ల మింగింది. డాక్టర్‌ని కలిస్తే ఆపరేషన్ చేసి తియ్యాలన్నాడు. డాక్టర్ వెంకట్రావ్ పట్ల నాకు నమ్మకం కలగడం లేదు. మహేష్: అదేం కాదోయ్! నువ్వు మరీ అంతగా […]
మహా సోమరి
ఒకడు మిత్రుడు కేరమ్స్ ఆడుతున్న చోటుకి వచ్చి అందర్నీ చూసి ‘మీలో ఎవరు సోమరిపోతో అతనికి ఐదు వందల నోటు యిద్దామనుకుంటున్నా’ అన్నాడు.
వాళ్లలో ఒకడు ‘సరే! వచ్చి నా బ్యాక్ పాకెట్లో పెట్టు’ అన్నాడు.
************
డబ్బున్న డాక్టర్
మోహన్రావు: మా అమ్మాయి రూపాయి బిళ్ల మింగింది. డాక్టర్‌ని కలిస్తే ఆపరేషన్ చేసి తియ్యాలన్నాడు. డాక్టర్ వెంకట్రావ్ పట్ల నాకు నమ్మకం కలగడం లేదు.
మహేష్: అదేం కాదోయ్! నువ్వు మరీ అంతగా వర్రీ కావాల్సిన పన్లేదు. ఆ డాక్టర్ బాగా డబ్బున్న వాడు. మరీ రూపాయి కోసం కక్కుర్తి పడతాడని అనుకోను.
************
గాడిద తెలివి
ఒకతన్ని ఓ గాడిద కాలితో తన్ని పరిగెత్తింది. అతను దాని వెంటపడ్డాడు. కనిపించకుండా పోయింది.
సందుల్లో వెతుకుతూ ఉంటే ఒక జీబ్రా కనిపించింది. అతను దాన్ని బాదుతూ ‘నువ్వు కోటు వేసుకున్నంత మాత్రాన గుర్తుపట్టలేనను కున్నావా?’ అన్నాడు.
************
ముద్దుకొక చీర
బట్టల కొట్టుకు వెళ్లిన అందమైన అమ్మాయి ‘చీర ఎంత? అని అడిగింది.
అల్లరి వాడయిన సేల్స్‌బాయ్ ‘ముద్దుకొకటి’ అన్నాడు.
ఆ అమ్మాయి ‘పది చీరలివ్వు’ అంది
ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి పది చీరలు ప్యాక్ చేశాడు. ఉత్సాహంగా ఆ అమ్మాయి వైపు చూశాడు
ఆ అమ్మాయి ప్యాకెట్ తీసుకుని వెనక్కి చూపిస్తూ… ‘బిల్లు మా తాత చెల్లిస్తాడు’ అంది.
Comedy,Comedy in Telugu,Humour,Jokes,Jokes in Telugu,Telugu Comedy,Telugu Humour,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/04/04/jokes-in-telugu-23/