2015-04-04 08:03:47.0
చుట్టరికం ఒక అబ్బాయి దారంటే వెళుతూ కాలు జారి ఒక గాడిద ముందు పడ్డాడు అక్కడే ఉన్న ఒకమ్మాయి నవ్వి ‘మీ అన్న ఆశీర్వాదం తీసుకుంటున్నావా?’ అంది. ఆ అబ్బాయి దుమ్ము దులుపుకుంటూ లేస్తూ ‘నిజం చెప్పావు వదినా” అన్నాడు. ************ నయాగరా శబ్దం గైడ్ నయాగరా జలపాతం దగ్గర దాని గొప్పతనాన్ని టూరిస్టులకు వివరిస్తున్నాడు. ”మిమ్మల్ని నయాగరా జలపాత దర్శనానికి ఆహ్వానిస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ఏ జల పాతమూ ఇంత గొప్పగా శబ్దం చేయదు. పది […]
చుట్టరికం
ఒక అబ్బాయి దారంటే వెళుతూ కాలు జారి ఒక గాడిద ముందు పడ్డాడు అక్కడే ఉన్న ఒకమ్మాయి నవ్వి ‘మీ అన్న ఆశీర్వాదం తీసుకుంటున్నావా?’ అంది.
ఆ అబ్బాయి దుమ్ము దులుపుకుంటూ లేస్తూ ‘నిజం చెప్పావు వదినా” అన్నాడు.
************
నయాగరా శబ్దం
గైడ్ నయాగరా జలపాతం దగ్గర దాని గొప్పతనాన్ని టూరిస్టులకు వివరిస్తున్నాడు. ”మిమ్మల్ని నయాగరా జలపాత దర్శనానికి ఆహ్వానిస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ఏ జల పాతమూ ఇంత గొప్పగా శబ్దం చేయదు. పది సూపర్ సానిక్ విమానాలు దూసుకుపోయినా ఈ జలపాతం హోరు ముందు వాటి శబ్దం విపిపించదు” అంది. ”అమ్మా! మీరు కాస్త మాట్లాడ్డం ఆపుతారా! అప్పుడు మేము నయాగరా శబ్దం వినగలం” అన్నాడు.
************
సర్దార్జీ తెలివి
లక్ష మైళ్లు తిరిగిన కారును అమ్ముదామని ప్రయత్నిస్తే ఎవరూ కొనలేదని సర్దార్జీ బాధ పడుతూ ఉంటే మిత్రుడు సర్దార్జీని ఓదార్చి మీటర్‌ని ముప్పయి వేలు తిరిగినట్లు మార్చి వెళ్లాడు.
కొన్నాళ్ల తరువాత మిత్రుడు వచ్చి కారు అమ్మావా? అని అడిగాడు. అందుకు సర్జార్జీ ‘ముప్పయి వేల మైళ్లే తిరిగిన కారుని అమ్మడానికి నేనేమయినా పిచ్చివాణ్ణా!! అన్నాడు
************
రిలాక్సింగ్
సన్‌బాత్ చేస్తున్న సర్దార్జీని ఒక స్త్రీ ‘ఆర్‌యు రిలాక్సింగ్!’ అని అడిగింది. సర్దార్జీ ‘నో! అయాం బంటాసింగ్!’ అన్నాడు. ఆ స్త్రీ వెళ్లిపోయింది.
తరువాత కాసేపటికి బంటాసింగ్ లేచి బీచ్‌లో నడుస్తూ ఉంటే అక్కడ కూర్చుని ఉన్న మరో సర్దార్జీ కనిపించాడు. ఆ సర్దార్జీని చూసి ‘ఆర్‌యు రిలాక్సింగ్!’ అని అడిగాడు. అతను ‘అవును!!’ అన్నాడు. వెంటనే బంటాసింగ్ ఆ సర్జార్జీని చెంపదెబ్బ కొట్టి ‘అక్కడొక స్త్రీ నీకోసం వెతుకుతూ ఉంటే యిక్కడున్నావా?’ అన్నాడు.
Comedy,Comedy in Telugu,Humour,Jokes,Jokes in Telugu,Telugu Comedy,Telugu Humour,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/04/04/jokes-in-telugu-24/