జర నవ్వండి ప్లీజ్ 57

2015-04-17 22:00:19.0

బిల్లు షాక్‌ డాక్టర్‌ : వారంలో మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఐతే మీరు కారులో తిరగడం మానేసి ఎప్పుడూ నడవడం అలవాటు చేసుకోవాలి. పేషెంట్‌ : తప్పకుండా వచ్చేవారం నించి నాకు తప్పేట్లు లేదు. డాక్టర్‌ : ఎందుకలా అంటున్నారు. పేషెంట్‌ : మీ బిల్లు వస్తుంది. అది కట్టాలంటే నా కారు అమ్మాలి. కారు అమ్మితే అన్నిటికీ కాలినడకనే వెళ్ళాల్సి వుంటుంది కదా! బీటింగ్‌ డాక్టర్‌ : మీ ఆవిడ టెన్నిస్‌ బ్యాట్‌తో కొట్టిందా? […]

బిల్లు షాక్‌

డాక్టర్‌ : వారంలో మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఐతే మీరు కారులో తిరగడం మానేసి ఎప్పుడూ నడవడం అలవాటు చేసుకోవాలి.
పేషెంట్‌ : తప్పకుండా వచ్చేవారం నించి నాకు తప్పేట్లు లేదు.
డాక్టర్‌ : ఎందుకలా అంటున్నారు.
పేషెంట్‌ : మీ బిల్లు వస్తుంది. అది కట్టాలంటే నా కారు అమ్మాలి. కారు అమ్మితే అన్నిటికీ కాలినడకనే వెళ్ళాల్సి వుంటుంది కదా!

బీటింగ్‌

డాక్టర్‌ : మీ ఆవిడ టెన్నిస్‌ బ్యాట్‌తో కొట్టిందా? ఎందుకని?
పేషెంట్‌ : సమయానికి క్రికెట్‌ బ్యాట్‌ దొరకలేదని!

హడావిడి మేళం

సుబ్బారావు ఎయిర్‌లైన్స్‌ వాళ్ళకు ఫోన్‌ చేశాడు.
సుబ్బారావు : బాంబేకి వెళ్ళే ప్లైట్‌ ఎప్పుడు బయల్దేరుతుంది?
ఎయిర్‌లైన్స్‌ నుండి : ప్లీజ్‌! వన్‌ మినిట్‌!
సుబ్బారావు : థాంక్స్‌! అని ఫోన్‌ పెట్టేశాడు.

Comedy,Comedy in Telugu,Humour,Jokes,Jokes in Telugu,Telugu Comedy,Telugu Humour,Telugu Jokes

https://www.teluguglobal.com//2015/04/18/jokes-in-telugu-52/