2015-04-28 19:26:02.0
టీచర్ – కార్తీక్! వాటర్ ఫార్ములా చెప్పు కార్తీక్ – HIJKLMNO టీచర్ – నువ్వు నర్సరీలో చదువుకుంటున్నావా? కార్తీక్ – మీరే కదా టీచర్ H to O అని చెప్పారు. (H2O) —————————————————— టీచర్ – మురళీ ఒక చదరపు గజానికి ఎన్ని అడుగులు? మురళి – అక్కడ ఎంతమంది నిల్చున్నారు అన్న దాన్ని బట్టి ఎన్ని అడుగులో చెప్పొచ్చు టీచర్. —————————————————— హెయిర్ సెలూన్ షాపులో క్రాపు చేస్తున్న అతన్తో కస్టమర్ దాదాపుగా […]
టీచర్ – కార్తీక్! వాటర్ ఫార్ములా చెప్పు
కార్తీక్ – HIJKLMNO
టీచర్ – నువ్వు నర్సరీలో చదువుకుంటున్నావా?
కార్తీక్ – మీరే కదా టీచర్ H to O అని చెప్పారు. (H2O)
——————————————————
టీచర్ – మురళీ ఒక చదరపు గజానికి ఎన్ని అడుగులు?
మురళి – అక్కడ ఎంతమంది నిల్చున్నారు అన్న దాన్ని బట్టి ఎన్ని అడుగులో చెప్పొచ్చు టీచర్.
——————————————————
హెయిర్ సెలూన్ షాపులో క్రాపు చేస్తున్న అతన్తో కస్టమర్ దాదాపుగా నాది బట్ట తల. కటింగ్‌కు 50 రూపాయలు చాలా ఎక్కువ అన్నాడు.
కటింగ్ చేసే అతను మా శ్రమ కూడా మీరు చూడాలి సార్. తలలో వెతికి వెంట్రుకలు కనిపెట్టి కటింగ్ చెయ్యడమంటే అంత సులభమైన పనా? అన్నాడు.
——————————————————
మోడ్రన్ ఆర్ట్ గ్యాలరీలో ఒక మధ్య తరగతి స్త్రీ ఒక దగ్గర నిల్చుని చూస్తూ ఇంత అసహ్యంగా ఉంది. ఇది మోడ్రన్ ఆర్టా! అని అక్కడున్న అతన్ని అడిగింది.
అతను వినయంగా అది అద్దం మేడమ్ అన్నాడు.
Comedy in Telugu,humour in telugu,Jokes in Telugu
https://www.teluguglobal.com//2015/04/29/jokes-in-telugu-68/