2015-05-05 13:03:32.0
లిల్లీ చేతులు జోడించి “దేవుడా! మా అమ్మను కాపాడు, మా నాన్నను చల్లగా చూడు, భారతదేశానికి హైదరాబాద్ రాజధాని అయ్యేలా చూడు” అని ప్రార్థించింది. లిల్లీ ప్రార్థన విన్న లిల్లీ తల్లి “ఎందుకలా భారతదేశానికి రాజధాని హైదరాబాదు అయ్యేలా చూడమని దేవుణ్ణి ప్రార్థించావు?” అంది. లిల్లీ “నేను పరీక్షలో అలానే రాశాను మమ్మీ” అంది. ————————————- స్వర్ణ: రాణీ! మీ ఆయన మరీ రెచ్చగొట్టేలా బట్టలేసుకుంటాడు. రాణి: ఎవర్ని? నిన్నా? నన్నా? ————————————- తల్లి: […]
లిల్లీ చేతులు జోడించి “దేవుడా! మా అమ్మను కాపాడు, మా నాన్నను చల్లగా చూడు, భారతదేశానికి హైదరాబాద్ రాజధాని అయ్యేలా చూడు” అని ప్రార్థించింది.
లిల్లీ ప్రార్థన విన్న లిల్లీ తల్లి “ఎందుకలా భారతదేశానికి రాజధాని హైదరాబాదు అయ్యేలా చూడమని దేవుణ్ణి ప్రార్థించావు?” అంది.
లిల్లీ “నేను పరీక్షలో అలానే రాశాను మమ్మీ” అంది.
————————————-
స్వర్ణ: రాణీ! మీ ఆయన మరీ రెచ్చగొట్టేలా బట్టలేసుకుంటాడు.
రాణి: ఎవర్ని? నిన్నా? నన్నా?
————————————-
తల్లి: కార్తిక్! ఎందుకు తమ్ముడు ఏడుస్తున్నాడు?
కార్తిక్: నా చాక్‌లెట్ అడుగుతున్నాడు, నేను ఇవ్వనన్నాను.
తల్లి: మరి వాడి చాక్‌లెట్ ఏమైంది?
కార్తిక్: నేను తినేశాను.
————————————-
జాన్సన్: మీరు భోజనానికి ముందు ప్రార్ధన చేస్తారా?
షీలా: అక్కర్లేదు, మా అమ్మ చక్కగా వంటలు చేస్తుంది.
https://www.teluguglobal.com//2015/05/06/jokes-in-telugu-74/