2015-05-06 21:30:32.0
పక్కింటావిడ వచ్చి సోఫాలో కూర్చుంది. కుర్రాడు ఆమెనే చూస్తున్నాడు “ఎందుకు బాబూ అలా చూస్తున్నావు? అంది ఆమె ముద్దుగా. “టీ ఇంకా రాలేదే అని చూస్తున్నానాంటీ” అన్నాడు. “టీ వస్తే ఏమవుతుంది?” అందామె ఆసక్తిగా. “మీరు పిల్లి నాలికతో వేడిపాలను తాకినట్లు తాకి టీ తాగుతారని మా డాడీ చెప్పాడు!” —————— “నన్ను తెలివి తక్కువ వాడనుకుంటున్నారా?” “నేననుకోవడం లేదు, నువ్వనుకుంటే నాకభ్యంతరం లేదు”. ——————— అతను: పది పిల్లులు, వంద ఎలుకలు, యాభై పందులు కావాలండి! […]
పక్కింటావిడ వచ్చి సోఫాలో కూర్చుంది.
కుర్రాడు ఆమెనే చూస్తున్నాడు
“ఎందుకు బాబూ అలా చూస్తున్నావు? అంది ఆమె ముద్దుగా.
“టీ ఇంకా రాలేదే అని చూస్తున్నానాంటీ” అన్నాడు.
“టీ వస్తే ఏమవుతుంది?” అందామె ఆసక్తిగా.
“మీరు పిల్లి నాలికతో వేడిపాలను తాకినట్లు తాకి టీ తాగుతారని మా డాడీ చెప్పాడు!”
——————
“నన్ను తెలివి తక్కువ వాడనుకుంటున్నారా?”
“నేననుకోవడం లేదు, నువ్వనుకుంటే నాకభ్యంతరం లేదు”.
———————
అతను: పది పిల్లులు, వంద ఎలుకలు, యాభై పందులు కావాలండి!
షాపతను: ఒక్కసారిగా యిన్ని కావాలంటే కష్టం. ఐనా ఎందుకడుగుతున్నారు?
అతను: “మా ఇంటి ఓనరు మీరు వున్న ఫళంగా ఇల్లు ఖాళీ చెయ్యాలి. మీరు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లు ఎలా ఉండేదో అలానే ఉండాలి ఇల్లు” అని ఆర్డర్ జారీ చేశాడు.
https://www.teluguglobal.com//2015/05/07/jokes-in-telugu-75/