జర నవ్వండి ప్లీజ్ 76

2015-05-07 13:01:17.0

“మా కుక్క నాతో చెస్‌ ఆడుతుంది”. “అది చాలా తెలివయిన కుక్కలా ఉంది.” “అదేంకాదు. ఈరోజు ఆడిన ఆరుగేముల్లో నాలుగు నేనే గెలిచాను.” ——————————– పళ్ళతోటలో ఉన్న రకరకాల పళ్ళు చూసి ఆమె ఆనందపడి తోట యజమానితో “ఇన్ని పళ్ళున్నాయి. వీటన్నిట్నీ ఏం చేస్తారు?” “బాగున్నవి తింటాం, బాగలేనివి అమ్ముతాం” అన్నాడు తాపీగా. ——————————– రచయిత: నాకు రచనాశక్తి లేదని నేను తెలుసుకోడానికి నాకు ఇరవయ్యేళ్ళు పట్టింది. మిత్రుడు: మరి రచనలు చెయ్యడం ఎందుకు మానెయ్య లేదు? […]

“మా కుక్క నాతో చెస్‌ ఆడుతుంది”.

“అది చాలా తెలివయిన కుక్కలా ఉంది.”

“అదేంకాదు. ఈరోజు ఆడిన ఆరుగేముల్లో నాలుగు నేనే గెలిచాను.”

——————————–

పళ్ళతోటలో ఉన్న రకరకాల పళ్ళు చూసి ఆమె ఆనందపడి తోట యజమానితో

“ఇన్ని పళ్ళున్నాయి. వీటన్నిట్నీ ఏం చేస్తారు?”

“బాగున్నవి తింటాం, బాగలేనివి అమ్ముతాం” అన్నాడు తాపీగా.

——————————–

రచయిత: నాకు రచనాశక్తి లేదని నేను తెలుసుకోడానికి నాకు ఇరవయ్యేళ్ళు పట్టింది.

మిత్రుడు: మరి రచనలు చెయ్యడం ఎందుకు మానెయ్య లేదు?

రచయిత: ఇంత గొప్ప రచయితగా పేరొచ్చాక ఎలా మానెయ్యమంటావు?

——————————–

తల్లి: తొందరగా రెడీకా! స్కూలుకు టైమవుతోంది.

కొడుకు: నేను వెళ్ళను!

తల్లి: నువ్వు వెళ్ళి తీరాలి?

కొడుకు: టీచర్లకు నేనంటే అసహ్యం. పిల్లలు నా ముఖం చూడ్డానికి ఇష్టపడరు. నేను స్కూలుకు ఎందుకు వెళ్ళాలి?

తల్లి: ఎందుకంటే నీకు నలభైఐదేళ్ళు. నువ్వా స్కూలు హెడ్‌మాస్టర్‌వి!

humour in telugu

https://www.teluguglobal.com//2015/05/08/jokes-in-telugu-76/