2025-01-21 10:25:42.0
రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నిస్తున్న జస్టిస్ ఘోష్
ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆయనను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. ఇప్పటికే రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్ ఆయనను విచారిస్తున్నది. నిర్మాణ సంస్థలకు పనులు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు సహా ఇతర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు.
కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్టు డిజైన్‌లు, బడ్జెట్ కేటాయింపులపై కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్‌కు నిధులు ఎలా సమకూర్చారు? కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారు? డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా? అని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేని రామకృష్ణారావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ వ్యాఖ్యానించింది. కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని కమిషన్ ప్రశ్నించగా.. పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు.
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీలు పెట్టలేదని ఈ సందర్భంగా కమిషన్ రికార్డులు చూపించింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదు. ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులు నిర్వహించలేదని పేర్కొన్నది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారెంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకున్నదని, 9 నుంచి 10.5 శాతం వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు.
Kaleshwaram Commission Inquiry,Kaleshwaram Project,Justice P.C. Ghose,Ramakrishna Rao,Appeared,Nefore Justice PC Ghosh Commission