జాతిపిత మహాత్మా గాంధీకి గవర్నర్, సీఎం రేవంత్ నివాళ్లు

2025-01-30 09:49:02.0

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్ జిష్ణు దేవ్, సీఎం రేవంత్ బాపూఘాట్ వద్ద అంజలి ఘటించారు.

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని సందర్బంగా లంగర్ హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,సీఎం రేవంత్ రెడ్డి నివాళ్లు అర్పించారు. అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ సేవలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు

Mahatma Gandhi,Governor Jishnu Dev Varma,Langar House,Bapughat,Speaker Gaddam Prasad Kumar,Ponguleti Srinivas Reddy,Tummala Nageswara Rao,Ponnam Prabhakar