https://www.teluguglobal.com/h-upload/2024/09/19/1360886-jani-master.webp
2024-09-19 11:59:53.0
బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై 376,506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషను పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకున్నది. అక్కడి కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.
జానీ మాస్టర్ అరెస్టుపై సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్టు చేశాం. హైదరాబాద్‌కు తీసుకువస్తున్నాం. 2020లో జానీ లైంగికదాడి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మైనర్‌గా ఉన్నప్పుడు లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై 376,506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Sexual assault case,against Jani Master,arrested in Goa,Janasena Party member