జానీ మాస్టర్‌ తల్లికి గుండెపోటు

 

2024-10-12 14:11:32.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/12/1368466-jhony-master-mother.webp

నెల్లూరులోని ఆస్పత్రిలో ట్రీట్‌ మెంట్‌

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తల్లి బీబీజాన్‌ గుండెపోటుతో అనారోగ్యానికి గురయ్యారు. శనివారం తనకు చాతిలో నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే నెల్లూరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జూనియర్‌ కొరియోగ్రాఫర్‌ పై అత్యాచారం ఆరోపణలతో జానీ మాస్టర్‌ జైళ్లో ఉన్నారు. కొడుకు జైలు పాలు కావడంతో బీబీజాన్‌ ఆందోళనలో ఉన్నారని, ఈక్రమంలోనే గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్‌ సతీమణి ఆయేషా వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 

 

Johnny Master,Choreographer,his mother,hart attack