https://www.teluguglobal.com/h-upload/2024/11/23/1380192-johnny.webp
2024-11-23 03:51:28.0
హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
Supreme Court,Dismisses,Johnny Master,Bail cancellation petition